![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని దర్శకుడు భారీ కాన్వాస్ పై తెరకెక్కించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ఆ మధ్య ఒక చిన్న టీజర్ ఈ సినిమా నుంచి విడుదలైంది. బహుశా ఈ టీజర్ కు ఎదురయినంత వ్యతిరేకత ఇటీవల కాలంలో మరి ఏ సినిమాకు ఎదురుకాలేదంటే అతిశయోక్తి కాదేమో...! రాముడు, హనుమంతుడు, రావణుడి పాత్రలను డిజైన్ చేసే తీరు హిందూ మత విశ్వాసాలను నమ్మేవారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.
అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఓంరౌత్ పూర్తిగా రామాయణం ఆధారంగా అదే టచ్ తో తీయకుండా రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఇండియన్ మైథలాజికల్ టచ్ ఫీల్ లేకుండా కంటెంట్ ని కాస్త అడ్వాన్స్ లెవెల్ లో ఆలోచించి హాలీవుడ్ ప్రేక్షకులకు మన రామాయణం గొప్పతనాన్ని వివరించేలా, వారికి మన ఔనత్యం తెలిపేందుకోసం వారికి నచ్చేలా, రీచ్ అయ్యేలా తీర్చిదిద్దారు.
ఈ టీజర్ పై దేశవ్యాప్తంగా నెగిటివ్ పబ్లిసిటీ రావడంతో ఈ చిత్రాన్ని మరలా గ్రాఫిక్స్ వర్క్స్ కోసం పంపించారు. దీనికోసం అదనంగా మరో వంద కోట్లు వెచ్చించారు. కేవలం గ్రాఫిక్స్ క్వాలిటీ కోసం ఈ 100 కోట్లను కేటాయించడం విశేషం. ఇలా రాజీపడకుండా ఈ చిత్రాన్ని భారీవ్యయంతో నిర్మిస్తున్న నిర్మాత భూషణ్ కుమార్ ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఏదో ప్రభాస్ డేట్స్ ఉన్నాయి కదా... ఒక కమర్షియల్ చిత్రం తీసి ఆయన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని భావించకుండా రామాయణంకి మోడ్రన్ టచ్ ఇస్తోన్న ఆయన గట్స్ ని మెచ్చుకుని తీరాలి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను భూషణ్ కుమార్ అనౌన్స్ చేశారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుందని ట్విట్టర్‌లో తెలియజేశారు. అయితే అదే రోజు హాలీవుడ్ సినిమాలైనా ది ఫ్లాష్, ఎలిమెంటల్ సినిమాలు అమెరికాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిపైన భారీ హైప్ క్రియేట్ అయి ఉంది. ఆది పురుష్ మూవీ రిలీజ్ కి వారం రోజుల ముందు మరో హాలీవుడ్ మూవీ ట్రాన్స్‌ఫార్మర్స్ రిలీజ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో యూఎస్ లో మెజార్టీ థియేటర్స్ లో హాలీవుడ్ మూవీస్ సందడి చేస్తాయి. దీంతో ఆదిపురుష్ సినిమాకి తక్కువ థియేటర్లు మాత్రమే లభించే అవకాశం ఉంది. హాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన ఆది పురుష్ కు ఎక్కువ థియేటర్లు లభించక సినిమాకి కొంత ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఆది పురుష్ విషయంలో నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
![]() |
![]() |