![]() |
![]() |

డైరెక్టర్ గా ప్రవీణ్ సత్తారు ప్రతిభను ఎవరు వేలెత్తి చూపలేరు. ఆయన 2011లో ఎల్బీడబ్ల్యూ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ అయ్యారు. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనేది ఈ చిత్రం పూర్తి పేరు. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు చిత్రాలను తీశారు. గుంటూరు టాకీస్ ను మరీ బోల్డ్ కంటెంట్ తో తీసి విమర్శలపాలయ్యారు. అలా తనను విమర్శించిన వారికి పిఎస్‌వి గరుడ వేగ చిత్రంతో సమాధానం ఇచ్చారు. ఈ చిత్రం ఆయనకు మంచి పేరును తీసుకొని వచ్చింది. రాజశేఖర్ ను యాక్షన్ హీరోగా ఆయన చూపించిన విధానం అందరికీ విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత ఆయన 11th అవర్ అనే వెబ్ సిరీస్ తీశారు. ఇందులో తమన్నా ప్రధాన పాత్రను పోషించింది. ఇక ఇటీవల ఆయన ఏకంగా కింగ్ నాగార్జునతో దిఘోస్ట్ చిత్రాన్ని తీశారు. ఇది డిజాస్టర్ అయ్యింది. కాగా ప్రస్తుతం ఆయన వరుణ్ తేజ్ హీరోగా 'గాండీవధారి అర్జున' టైటిల్‌తో చిత్రం చేస్తున్నారు. గతంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో బాలయ్య, రోజా, అక్కినేని నాగేశ్వరరావులతో గాండీవం అనే చిత్రం వచ్చి డిజాస్టర్ అయింది. ఇప్పుడు అదే తరహాలో గాండీవం అనే పేరు వచ్చేలా గాండీవధారి అర్జున చిత్రం టైటిల్ ఉంది. మరోవైపు గతంలో మహేష్ బాబు హీరోగా అర్జున్ చిత్రం వచ్చింది. ఇది బాగానే ఆడినా సూపర్ హిట్ కాలేకపోయింది. ఇలా కొందరు గాండీవం, అర్జున్ చిత్రాల కలయికలో రానున్న గాండీవధారి అర్జున్ టైటిల్ విషయంలో సెటైర్లు వేస్తున్నారు. అందునా మన వారికి ప్రతిది సెంటిమెంటేనని చెప్పాలి.
ఈ చిత్రం కూడా పీఎస్వీ గరుడ వేగ తరహాలోనే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. లండన్ బ్రిడ్జిపై వరుణ్ తేజ్ ని యాక్షన్ హీరోగా చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. భారీ బడ్జెట్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గూఢచారిగా నటిస్తున్నాడని సమాచారం. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్గ్ లో ఓ క్లాక్ టవర్ తో పాటు పురాతన కోట కనిపిస్తోంది. తుపాకులు, బాంబులు, కత్తులను చూపించారు. ఈ చిత్రం లండన్ బ్యాక్ డ్రాప్ తోపాటు యూరప్ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ మంత్రిని కాపాడే ఒక అండర్ వరల్డ్ కాప్ గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడని సమాచారం. ఇక ఇందులో జగపతిబాబు ఓ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ చిత్రం విషయంలో టైటిల్ తోపాటు కాస్త క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నాగార్జున కెరీర్ లోనే బారీ బడ్జెట్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ది ఘోస్ట్ చిత్రం చాలా పెద్ద కన్ఫ్యూజన్ గా నడుస్తుంది. యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువయ్యాయి అనేలా ప్రేక్షకులకి అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా మాస్ రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమా అర్థం కాలేదు అనే మాట వినిపించింది. దాంతో నిర్మాత భారీగా నష్టపోయారు. ఈ తప్పులు గాండీవధారి అర్జున్ లో ప్రవీణ్ సత్తార్ రిపీట్ చేయడనే అందరు భావిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ కూడా సోలో హీరోగా చివరిసారిగా గని అనే చిత్రంలో నటించారు. ఇది డిజాస్టర్ గా మిగిలింది. దీని తర్వాత ఆయన మరో ఫ్లాఫ్ డైరెక్టర్ అయిన ప్రవీణ్ సత్తార్ మీద నమ్మకంతో ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరి దర్శక హీరోలిద్దరు భారీ డిజాస్టర్స్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా వారి ఫేట్ ని ఏ స్థాయిలో మార్చుతుందో వేచి చూడాలి.
![]() |
![]() |