![]() |
![]() |

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది. ఆ వెంటనే ఆయన త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. కానీ ఆ షెడ్యూల్ షూటింగ్ నచ్చలేదని భావించినట్లు వార్తలు వచ్చాయి. ఆ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే మహేష్ తల్లి ఇందిరా దేవి, ఆ తర్వాత మహేష్ తండ్రి కృష్ణ చనిపోవడంతో ఇప్పటివరకు మళ్ళీ ఆ సినిమా జోలికి వెళ్లలేదు. ఇక ఈ నెల 18న షూటింగ్ ప్రారంభమైంది. సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఇదే ఏడాది విడుదల చేయడం ఖాయం. షూటింగ్ స్టేటస్ కూడా తెలియకుండా రిలీజ్ డేట్ ను ప్రకటించారు అంటే దాని వెనుక బలమైన కారణం ఉందని, పెద్ద ప్లాన్ తోనే అలా ప్రకటించారని అంటున్నారు.
ఎందుకంటే ఇప్పటివరకు మహేష్ బాబు కారణంగానే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి రిలీజ్ చేయాలనీ త్రివిక్రమ్ తో సహా నిర్మాతలను మహేష్ ఆదేశించారట. ఎందుకంటే ఆ వెంటనే కె ఎల్ నారాయణ నిర్మాణంలో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ వరల్డ్ ట్రావెలర్ గా కనిపించనున్నారు. ఇదో వరల్డ్ అడ్వంచర్ స్టోరీ అని తెలుస్తోంది. కథానుసారం మహేష్ బాబు ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాలట. దాంతో రాజమౌళి మహేష్ ను సిక్స్ ప్యాక్ లోకి మారాల్సిందిగా సూచించడంతో మహేష్ కూడా అదే పనిలో ఉన్నారు.
త్రివిక్రమ్, రాజమౌళి తో చేసే ఈ రెండు చిత్రాలలో మహేష్ లుక్ డిఫరెంట్ గా ఒకదానితో మరోటి సంబంధం లేకుండా ఉండనుందని సమాచారం. మేకోవర్ నుంచి అన్నింటిలోనూ ఈ రెండు చిత్రాలు విభిన్నం. త్రివిక్రమ్ చిత్రంలో మహేష్ రెట్రో లుక్ లో కనిపించనున్నారు. దానికి తగ్గట్లుగా ఆయన ఇప్పటికే మేకోవరయ్యారు. త్రివిక్రమ్ చిత్రం పూర్తయిన వెంటనే మహేష్ తన సిక్స్ ప్యాక్ బాడీ పై దృష్టి కేంద్రీకరించనున్నారు. కాబట్టి ఈ చిత్రం షూటింగ్ విషయంతో పాటు రిలీజ్ డేట్ కూడా ముందుగానే ప్రకటించి త్రివిక్రమ్ సినిమాని వీలున్నంత త్వరగా పూర్తి చేసి జక్కన్న చెప్పినట్లుగా సిక్స్ ప్యాక్ కోసం మహేష్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మహేష్ ఇప్పటివరకు 27 చిత్రాలలో నటించినా విభిన్నమైన మేకోవర్ తో ఆయన సరికొత్తగా కనిపించిన చిత్రం ఏమీ లేదు. మహేష్ ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కాస్త అతిథి చిత్రంలో డిఫరెంట్ గా ట్రై చేశారు. మొత్తానికి త్రివిక్రమ్, రాజమౌళిల చిత్రాలను సరైన ప్లానింగ్ తో పూర్తి చేయాలని మహేష్ దర్శకులను కోరినట్టు తెలుస్తోంది.
![]() |
![]() |