![]() |
![]() |

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత యంగ్ హీరో అక్కినేని అఖిల్ కి బాగా సూట్ అవుతుంది. ఈయన నటించిన చిత్రాలు ఏవి పెద్దగా ఘన విజయం సాధించలేదు. మొదటి సినిమా అఖిల్ నుంచి మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. అఖిల్ తో పాటు మిగిలిన చిత్రాలు కూడా నిరాశపరిచాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం ఫర్వాలేదు అనిపించింది. అక్కినేని అఖిల్‌కు అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన రొమాంటిక్ ఇమేజ్ కంటే మాస్ యాక్షన్ స్టార్ కావాలనేది మొదటి నుంచి కోరిక. అందుకే తన మొదటి చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ గా చేశారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత రొమాంటిక్ చిత్రాలలో నటించినా ఫలితం మాత్రం సేమ్ గానే వచ్చింది. ప్రస్తుతం ఆయన స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ బాడీ బిల్డింగ్ చేసి హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారు. దాంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా వాయిదాలు పడుతూ వస్తుండటం దీనికి మైనస్ పాయింట్ గా మారింది. డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం తాజాగా వేసవికి పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం. ఇలాంటి సమయంలో అక్కినేని అఖిల్ కు ఓ లక్కీ ఛాన్స్ వచ్చింది.
కేజిఎఫ్ ఫ్రాంచైజీలతో పాటు కాంతారా లాంటి సూపర్ డూపర్ హిట్ తీసిన హోంబలే ప్రొడక్షన్స్ లో అక్కినేని అఖిల్ ఓ సినిమా చేయనున్నారు. ఈ సంస్థ నుండి వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 లతోపాటు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం కాంతారా. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మొత్తంగా 400 కోట్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అక్కినేని అఖిల్ తో హోంబలే ఫిలిమ్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైనట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఈ చిత్రంతోనైనా అఖిల్ దశ మారుతుందేమోనని ఆయన అభిమానులు, అక్కినేని ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయనకు సరైన నిర్మాతలు ఇంతకాలానికి లభించారు. మరి వారు ఎంచుకునే డైరెక్టర్ ఎవరై ఉంటారా అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. ఏజెంట్ తో పాటు హోంబలే సంస్థ నిర్మించే చిత్రం అక్కినేని అఖిల్ దశను మారుస్తాయేమో వేచిచూడాల్సి వుంది.
![]() |
![]() |