సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'SSMB 28'పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మహేష్ కోసం త్రివిక్రమ్ ఫుల్ ప్యాకెడ్ ఎంటర్టైన్మెంట్ ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
'SSMB 28'లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల సందడి చేయనుందని సమాచారం. 'పెళ్లి సందడి'(2021)తో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి వరుస అవకాశాలు పట్టేస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా మహేష్ సినిమాలో అవకాశం రావడం బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని క్రేజీ అప్డేట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఐటమ్ సాంగ్స్ కి దూరంగా ఉండే దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రంలో ఓ క్రేజీ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఒక సీనియర్ హీరోయిన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం.