టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం 'వారిసు', 'RC15' వంటి భారీ సినిమాలు చేస్తున్న ఆయన కొన్ని చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. డ్యాన్స్ మాస్టర్ యశ్(యశ్వంత్)ని హీరోగా పరిచయం చేస్తూ ఆయనొక సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.
డ్యాన్స్ షో 'ఢీ'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యశ్.. సినిమాలలో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే డ్యాన్స్ మాస్టర్ గా ఎదుగుతున్న అతను ఇప్పుడు హీరోగా మారబోతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. అది కూడా దిల్ రాజు బ్యానర్ లో కావడం ఆసక్తికరంగా మారింది. రాక్ స్టార్ కథ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంతో శశి అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.