స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సమంత వంటి హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో చిందేసి మెప్పించగా ఇప్పుడు ఆ లిస్టులో రష్మిక మందన్న కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది.
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ ఓ స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించబోతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ లో చిందేసి హీరోయిన్ ఎవరు కాదు రష్మిక అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గతంలో మహేష్ సినిమాలలో ఐటెం సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఈ సాంగ్ కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందేమో చూడాలి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ నటి శోభన ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనుందని సమాచారం.