విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉందట. ఈ పాత్ర కోసం యంగ్ బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది.
'ఉప్పెన'(2021)తో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు ఆమెను చుట్టుముట్టాయి. అయితే ఈ ఏడాది వరుస పరాజయాలు పలకరించడంతో ఆమె జోరు కాస్త తగ్గింది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్య సరసన 'కస్టడీ'లో నటిస్తోంది. అలాగే ఓ మలయాళ చిత్రం చేస్తోంది. ఇక ఇప్పుడు ఆమెకు విజయ్ సరసన 'ఖుషి'లో నటించే అవకాశం వచ్చినట్టు న్యూస్ వినిపిస్తోంది. సెకండ్ హీరోయిన్ పాత్ర అయినప్పటికీ, ఇది సినిమాకి కీలకమైన పాత్ర కావడంతో కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.