భార్య ఆరోగ్యంపై సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..ప్రార్థనలు చేసారా!
on Mar 26, 2025
'అరుంధతి'మూవీతో తెలుగుప్రేక్షకుల అభిమాన నటుడుగా మారిన సోనుసూద్(Sonu sood)జులాయి, కందిరీగ,దూకుడు,అల్లుడు అదుర్స్,ఏక్ నిరంజన్ వంటి చిత్రాలతో మరింతగా దగ్గ్గరయ్యాడు.బాలీవుడ్ లో కూడా పలు హిట్ చిత్రాల్లో నటించిన సోనుసూద్ ఈ ఏడాది జనవరి 10 న 'ఫతే' అనే హిందీ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా తనే ఆ సినిమాని నిర్మించాడు.
సోమవారం సాయంత్రం సోనుసూద్ భార్య సోనాలి సూద్(Sonali Sood)తో పాటు ఇద్దరు బంధువులు కారులో వస్తుంటే మహారాష్ట్ర లోని నాగపూర్ వద్ద కారు యాక్సిడెంట్ కి గురవ్వడం జరిగింది.దీంతో కారులో ఉన్న ముగ్గురు తీవ్రగాయాలపాలవ్వడంతో హాస్పిటల్ లో చేర్పించారు.ఇప్పుడు ఈ విషయంపై సోనుసూద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి.నా భార్యతో పాటు బంధువులు క్షేమంగా ఉన్నారు.మద్దతుగా నిలిచిన అందరకి కృతజ్ఞతలు అని ట్వీట్ చేసాడు.ప్రాంతాలతో సంబంధం లేకుండా సోనూసూద్ ఎన్నో ఏళ్ళ నుంచి సామాజికంగాను పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థిక సాయం కూడా చేసుకుంటు వస్తున్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
