31 ఏళ్ళ తేడా ఐతే ఏం చేద్దాం..నాకు ఓకే కదా!
on Mar 24, 2025
బాలీవుడ్ అగ్రహీరో 'సల్మాన్ ఖాన్'(salman khan)రంజాన్(ramadan)కానుకగా ఈ నెల 30 న 'సికందర్'(Sikandar)తో వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.గత కొంత కాలంగా సరైన హిట్ లేని సల్మాన్ సికందర్ తో తన సత్తా చాటతాడని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.సల్మాన్ కి జోడిగా వరుస విజయాలతో నేషనల్ క్రష్ గా మారిన స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)చేస్తుండటంతో 'సికందర్' పై అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
రీసెంట్ గా సికందర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో జరిగింది.భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర యూనిట్ తో పాటు కొద్దిమంది సల్మాన్ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సల్మాన్ తో ఒక మీడియా ప్రతినిధి రష్మిక,సల్మాన్ ఏజ్ కి మధ్య గ్యాప్ గురించి ప్రశ్న వేసాడు.దీంతో సల్మాన్ మాట్లాడుతు మా వయసు గురించి మీకెందుకు నాకు,రష్మికకి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు.ఈ విషయంలో రష్మిక ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు.ఒకవేళ భవిష్యత్తులో రష్మిక కి పెళ్లి జరిగి పాప పుడితే,ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది.అప్పుడు ఆ పాపతో కూడా నేను కలిసి నటిస్తానని సల్మాన్ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
ఇక 'సికందర్' ట్రైలర్ చూస్తుంటే సల్మాన్ క్యారక్టర్ లో విభిన్న రకాల షేడ్స్ ఉన్నట్టుగా అర్ధమవుతుంది.యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ దర్శకుడు 'మురుగదాస్'(Ar Murugadoss)గత చిత్రాల మాదిరిగా బలమైన సోషల్ మెసేజ్ కూడా ఉందనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. సల్మాన్ నట విశ్వరూపం పక్కా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.సత్య రాజ్,కాజల్ అగర్వాల్,అంజిని థావన్,కిషోర్ షర్మాన్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించగా సాజిద్ నడియావాలా(Sajid Nadiadwala)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలు గడవక ముందే 43 మిలియన్ల వ్యూస్ ని సాధించడంతో పాటు ట్రెండింగ్ పరంగా మూడోస్థానంలో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
