నాని సినిమా షూటింగ్‌లో విషాదం
on Jan 1, 2025
నాని, అడివి శేష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ 3 చిత్రం షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జమ్ము కాశ్మీర్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కె.ఆర్.కృష్ణ అనే మహిళ లొకేషన్‌లోనే గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 30 సంవత్సరాలు. ఆమె మృతి పట్ల చిత్ర యూనిట్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read