రాయన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రెండో అతి పెద్ద మూవీగా రికార్డు
on Jul 27, 2024
ధనుష్(dhanush)హీరోగా లేటెస్ట్ గా వచ్చిన యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ రాయన్(raayan)ధనుష్ 50 th మూవీ కావడంతో అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. అందుకు తగ్గట్టే మూవీ కూడా ఉందనే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.
రాయన్ మొదటి రోజు 12.5 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు ఒక్క తమిళనాడు లోనే 11 కోట్లు రాబట్టిన రాయన్ తెలుగుతో సహా మిగతా చోట్ల 1.5 కోట్లు సాధించాడని సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.అదే విధంగా తమిళనాడు మొత్తం రిలీజ్ రోజు 58.65% ఆక్యుపెన్సీని పొందాడు. ఇక మరో అరుదైన రికార్డు ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళనాడు లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సెకండ్ మూవీగా నిలిచింది. మొదటి ప్లేస్ లో కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 26 కోట్లుతో మొదటి స్థానంలో ఉంది. ఇక రాయన్ కి పాజిటివ్ టాక్ రావడం, పాన్ ఇండియా లెవల్లో విడుదల కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మరిన్ని రికార్డులు రాయన్ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.
సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, కాళిదాస్ జయరాం, దుషరా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించగా ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. సన్ పిక్చర్స్ పై కళానిది మారన్ 100 కోట్ల బడ్జట్ తో నిర్మించగా ధనుష్ నే దర్శకత్వం వహించాడు.ఇక ధనుష్ అభిమానులు అయితే రాయన్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ని జరుపుకుంటున్నారు.
Also Read