ఉగ్రవాద దాడి ఘటనపై ప్రకాష్ రాజ్ ట్వీట్..మా రక్తం మరిగిపోతుంది
on Apr 24, 2025

సుదీర్ఘ కాలం నుంచి విలక్షణమైన నటనతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న బహుబాషా నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj)మంగళవారం జమ్మూకాశ్మీర్ లోని పహల్ గామ్ లో ఉగ్రవాదులు అత్యంత దారుణంగా టూరిస్టులని కాల్చిచంపిన విషయంపై 'ఎక్స్' వేదికగా స్పందించాడు.
ఒక సుదీర్ఘమైన నోట్ ని రాసుకొస్తు ఏప్రిల్ 22 వ తేదీ పర్వతాలు కూడా మోయలేనంత నిశ్శబ్డం ఆవహించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రదేశం పహాల్గమ్ లో నెత్తురు చిందించిన రోజు. మనఇంటికి వచ్చిన అమాయకపు అతిధుల్ని దారుణంగా చంపారు. అమాయకులపైనే కాదు కాశ్మిర్ పై జరిగిన దాడి. దీంతో శతాబ్దాల సంప్రదాయానికి అవమానం జరగడంతో పాటు ప్రతి కాశ్మీరీ గుండె పగిలింది. ఈ దాడి గురించి మాట్లాడానికి మాటలు కూడా రావడం లేదు. మన విశ్వాసాన్ని దెబ్బ తీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణ చర్య. ఇలాంటివి జరిగిన ప్రతిసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తుంది. గుర్తింపుని కాపాడుకోవడంతో పాటు చెయ్యని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది. దాడిని మాత్రం క్షమించకూడదు. ముమ్మాటికీ ఇది భయంకరమైన చర్య, అంతకు మించి పిరికి చర్య , మా రక్తం మరిగిపోతుందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



