ఆ కుటుంబానికి అండగా నిలబడతాం.. మైత్రి మూవీ మేకర్స్!
on Dec 5, 2024
బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటన అందర్నీ కలచివేసిన విషయం తెలిసిందే. ‘పుష్ప2’ ప్రీమియర్‌కి వచ్చిన ఒక కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. తల్లిని కోల్పోయిన పిల్లలు విలపిస్తున్నారు. భార్య మృతి చెందడం, కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో భర్త భాస్కర్ మానసిక వ్యధలో ఉన్నారు. బుధవారం రాత్రి నుంచి వివిధ మాధ్యమాల్లో ఈ దుర్ఘటన గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జునే తీసుకోవాలనే కామెంట్స్ వినిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ‘పుష్ప2’ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించింది.
‘నిన్న జరిగిన విషాద ఘటనతో మా గుండె కోతకు గురైంది. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఈ కష్టకాల సమయంలో ఆ కుటుంబానికి మేం అండగా నిలబడతాం. వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తాం’ అంటూ ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు.
Also Read