చనిపోయిన మహిళ యొక్క కుటుంబ బాధ్యత తీసుకున్న అల్లు అర్జున్
on Dec 5, 2024
హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 ప్రీమియర్ షోకి అల్లు అర్జున్(allu arjun)రావడంతో,అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేణుక అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో పోరాడుతున్నాడు.ఇంకో మూడు రోజులు అయితే గాని శ్రీతేజ హెల్త్ కండిషన్ గురించి చెప్పలేమని డాక్టర్స్ చెప్తున్నారు.దీంతో శ్రీతేజ తండ్రి తన బిడ్డకి వైద్యం చేయించే స్థోమత లేదని, అల్లు అర్జున్ నే తమని ఆదుకోవాలని మీడియా ముఖంగా కోరడం జరిగింది
దీంతో ఇప్పుడు ఈ ఘటనపై అల్లు అర్జున్ కాంపౌండ్ మాట్లాడుతు తొక్కిసలాటలో మహిళ చనిపోవడం చాలా బాధగా ఉంది.హాస్పిటల్ లో ఉన్నబాలుడి వైద్యానికి అయ్యే ఖర్చుని కూడా భరిస్తాం. అదే విధంగా చనిపోయిన మహిళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటుగా ఆ కుటుంబం బాధ్యత కూడా అల్లు అర్జున్ దే అని సోషల్ మీడియా వేదికగా తెలియచేయడం జరిగింది.
Also Read