మట్కా ఓటిటి డేట్ ఇదే
on Nov 30, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej)మీనాక్షి చౌదరి(meenakshi chowdhary)హీరో హీరోయిన్లుగా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మట్కా(matka).నవీన్ చంద్ర,సలోని,నోరా ఫతేహి,అజయ్ ఘోష్,జాన్ విజయ్,కిషోర్,రవి శంకర్,సత్యం రాజేష్ వంటి వారు ముఖ్యపాత్రల్లో చెయ్యగా కరుణకుమార్(karuna kumar)దర్శకత్వం వహించాడు.ఎస్ ఆర్ టి అండ్, వైరా ఎంటెర్ టైన్మెంట్స్ పతాకంపై తాళ్లూరి శ్రీదేవి,విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లో అమెజాన్ ప్రైమ్ వేదికగా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్టుగా సదరు సంస్థ వెల్లడి చేసింది.మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ ని తెచ్చుకున్న మట్కా ఓటిటి లో ఏ మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
బర్మా నుంచి వైజాగ్ నుంచి శరణార్థిగా వచ్చిన వాసు ఒక యువకుడు కాలక్రమంలో మట్కా కింగ్ గా అవతరించి ఇండియాలో ఉన్న వంద శాతం డబ్బులో తొంబై శాతం మొత్తాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు.అది వాసుకి ఎలా సాధ్యమైంది! ఆ తర్వాత తను ఎదుర్కున్న పరిణామాలు ఏంటనే పాయింట్ తో మట్కా తెరకెక్కింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.
Also Read