ఏది మీకు చెందదంటూ మంచు లక్ష్మి ట్వీట్
on Dec 11, 2024
మంచు మోహన్ బాబు(mohan babu)మనోజ్(manoj)మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంపై మనోజ్ ని ఉద్దేశించి మోహన్ బాబు ఒక వీడియో విడుదల చెయ్యడం,ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది, మనోజ్ కూడా తన పోరాటం ఆస్తుల మీద కాదని,నా తండ్రి దేవుడని చెప్తూ మోహన్ బాబు దగ్గర ఉండే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ,అసలు విషయం ఏంటో ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని ఆ తర్వాత ప్రెస్ మీట్ ని వాయిదా వెయ్యడం జరిగింది.విష్ణు(vishnu)రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి మోహన్ బాబు కి మద్దతుగా మాట్లాడగా గొడవ జరిగిన రోజే మంచు లక్ష్మి(manchu lakshmi)అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళింది.
ఇక రీసెంట్ గా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని ఏదీ మీకు చెందనప్పుడు, మీరు ఏమి కోల్పోతారని భయపడుతున్నారని ట్వీట్ చెయ్యడం జరిగింది. నిన్న కూడా శాంతి మంత్రం పీస్ అంటూ పోస్ట్ చెయ్యగా ఇప్పుడు ఈ రెండు ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఈ గొడవలో ఆమె మనోజ్ కి మొదట నుంచి సపోర్ట్ గా నిలుస్తుందన్న మాటలు వినపడుతున్నాయి.
Also Read