మోహన్ బాబు మీద ఉన్నపాత కేసుని మార్చేసిన పోలీసులు..దీని వెనుక ఉంది వాళ్లే
on Dec 11, 2024
మోహన్ బాబు(mohan babu)మనోజ్(manoj)మధ్య జరుగుతున్న గొడవలో మీడియా ప్రవేశించడం,మీడియాని ఎప్పుడు గౌరవించే మోహన్ బాబు ఆవేశంతో ఒక జర్నలిస్ట్ ని మైక్ తో కొట్టడం తెలిసిన విషయమే.దీంతో మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని మీడియా సంఘాలు కోరగా పోలీసులు సెక్షన్ 118 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
కానీ ఇప్పుడు పోలీసులు సెక్షన్ 118 నుంచి సెక్షన్ బిఎన్ఎస్ 109 కి మార్చడం జరిగింది.దీంతో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదయినట్టయ్యింది.లీగల్ ఒపీనియన్ తీసుకునే పోలీసులు సెక్షన్ మార్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ కేసులో మోహన్ బాబు ఈనెల 24 వరకు పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు వెల్లడించింది.ఇక అస్వస్థతతో రెండు రోజుల క్రితం హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.