వారెవా వారెవా.. లెనిన్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
on Jan 5, 2026

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) టాలెంట్ కి తగ్గ సరైన సినిమా ఇంకా పడలేదు అనేది అక్కినేని అభిమానుల అభిప్రాయం. అఖిల్ నెక్స్ట్ మూవీ 'లెనిన్'(Lenin) ఆ లోటుని భర్తీ చేస్తుంది అనేది వారి నమ్మకం.
మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ 'లెనిన్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ 'వారెవా వారెవా' విడుదలైంది. (Lenin First Single)
'వారెవా వారెవా'(VaareVaa VaareVaa) లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. "కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా వినపడతాదంట.. ఏంది విన్నావా.. బంగారం" అంటూ అఖిల్ తో భాగ్యశ్రీ చెప్పే మాటతో పాట ప్రారంభమైంది. తమన్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్ ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది.
Also Read: రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ.. తప్పంతా వాళ్ళదే..!
"ఇన్నావా ఇన్నావా కన్నెపిల్ల ఏమందో ఇన్నావా" అంటూ అనంత శ్రీరామ్ అందించిన సాహిత్య ఆకట్టుకుంది. ఇక సింగర్స్ శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ తమ వాయిస్‌తో పాటకు ఓ ఎమోషనల్ ఫీల్‌ను తీసుకొచ్చారు.
శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోన్న 'లెనిన్' సినిమా.. ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అలాగే ఈ మూవీని సమ్మర్లో మే 1న విడుదల చేయనున్నట్లు లిరికల్ వీడియోలో మేకర్స్ రివీల్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



