ఏమిటి ఈ అన్యాయం.. ఫ్యాన్స్ ఆవేదన నిజమేనా!
on Jan 5, 2026

-రాజా సాబ్, జననాయకుడు మధ్య భారీ పోటీ
-సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆవేదన ఎందుకు
-నిజంగానే థియేటర్స్ విషయంలో ఆ హీరోకి అన్యాయం జరుగుతుందా!
మిగతా సీజన్స్ లో సినిమా చూస్తే వచ్చే కిక్ కి, సంక్రాంతి(Sankranthi)సీజన్ లో చూస్తే వచ్చే కిక్ కి డిఫరెంట్ ఉంది. ఈ మాట నిజమని తెలుగు ప్రేక్షకులు స్వయంగా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పైగా ఈ సీజన్ లో చిన్న హీరో, పెద్ద హీరో అనే తారతమ్యం ఉండదు. కంటెంట్ బాగుంటే చాలు బాక్స్ ఆఫీస్ పై జులుం పక్కా. అందుకే ఎక్కువ సంఖ్యలో సినిమాలు సెల్యులాయిడ్ పై అడుగుపెడతాయి. అదే సమయంలో థియేటర్స్ విషయంలో తమ హీరోకి అన్యాయం జరుగుతుందని అభిమానులు ఆవేదన చెందటం కూడా సంక్రాంతి సీజన్ ప్రత్యేకత. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఇదే రకమైన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్(Prabhas)ఈ నెల 9 న 'ది రాజా సాబ్'(The Rajasaab)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఇదే రోజు విజయ్(VIJay)కూడా 'జన నాయకుడు' తో సందడి చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాలతో పాటు హైదరాబాద్(HYderabad) నగరంలో'జన నాయకుడు’కి మంచి సంఖ్యలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లుని కేటాయిస్తున్నారు. మల్టి ప్లెక్స్ పరంగా కూడా పివి,ఆర్, ఐనాక్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుండటంతో, హైదరాబాద్‌లోని చాలా మల్టీప్లెక్సులు జననాయకుడు కి ఎక్కువ షోలు కేటాయించడం ఖాయం.
Also read: పుట్టిన రోజున దీపికా పదుకునే కీలక ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్న ‘ది రాజా సాబ్’కి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, డబ్బింగ్ సినిమా ‘జన నాయకుడు’కి ఎక్కువ స్క్రీన్లు ఇవ్వడం అన్యాయం . తమిళనాడు(Tamilnadu)లో ‘ది రాజా సాబ్’కు మాత్రం సరైన స్క్రీన్లు దక్కడం లేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. మరో వాళ్ల ఆవేదనలో నిజమెంత ఉందో కొన్ని రోజుల్లో తెలిసే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



