అక్టోబర్ 18న లగ్గం...
on Sep 15, 2024
సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా 'లగ్గం'. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారని చిత్రం బృందం చెబుతోంది.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది" అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్.బి. శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి నేపథ్య సంగీతం మణిశర్మ అందిస్తుండటం విశేషం.
Also Read