సినీ నిర్మాత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమం..ముంబై కి తరలింపు
on Mar 31, 2025
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వివి వినాయక్(Vv Vinayak)కాంబోలో 'ఆది' లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సాంబ'(samba).2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్నేనమోదు చెయ్యడమే కాకుండా 'చదువు 'యొక్క గొప్పతనాన్ని,ఆవశ్యకతని చాటి చెప్పింది.గుడివాడ మాజీ ఏంఎల్ఏ కొడాలి నాని భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించాడు.ఎన్టీఆర్,వివి వినాయక్ కాంబోలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ 'అదుర్స్' కి సమర్పకుడిగా కూడా కొడాలి నాని వ్యవహరించడం జరిగింది.
గుండెకి సంబంధించిన సమస్యలు తలెత్తడంతో కొడాలి నాని(Kodali Nani)కొన్ని రోజుల క్రితం హైదరాబాద్(Hyderabad)లోని ఒక ప్రవైట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.ఇప్పుడు పరిస్థితి కొంచం సీరియస్ గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ముంబై(Mumbai)కి తరలించారు.కొడాలి నాని వెంట అయన భార్యతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ముంబై వెళ్లినట్టుగా తెలుస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
