తొందర్లోనే మీకు భయమంటే ఏంటో చూపిస్తాం
on Mar 31, 2025
.webp)
2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ(Karthi)స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'సర్ధార్'(sardar)తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసింది.ఏజెంట్ చంద్రబోస్,పోలీస్ ఇన్ స్పెక్టర్ విజయ్ ప్రకాష్ గా కార్తీ డ్యూయల్ రోల్ లో కనపర్చిన నటన ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది.దీంతో సర్దార్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న'సర్దార్ 2(sardar 2)పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగా పార్ట్ 1 కి దర్శకత్వం వహించిన 'పి ఎస్ మిత్రన్'(Ps mithran)రెండవ పార్ట్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. వర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య(sj Surya)విలన్ గా చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారకంగా ప్రకటిస్తు ఒక వీడియో రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్తీ మాట్లాడుతు సర్దార్ మొదటి పార్ట్ విడుదలైనప్పుడు చాలా మంది వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగేందుకు భయపడ్డారు.ఈ విషయాన్ని తెలియచేస్తు మాకు మెసేజెస్ కూడా పంపడం జరిగింది.అంత స్ట్రాంగ్ మెసేజ్ ని సర్దార్ మూవీ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది.పార్ట్ 2 కి సంబంధించి మిత్రన్ నాకు కాన్సెప్ట్ చెప్పినపుడు షాక్ అయ్యా.పార్ట్ 2 ప్రేక్షకులని మరింత భయపెడుతుంది.ఎస్ జె సూర్య మా చిత్రంలో భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్నిఇస్తుందని చెప్పుకొచ్చాడు.
ఆషికా రంగనాధ్(Ashika Ranganath)మాళవిక మోహన్(Malavika Mohanan)రజిషా విజయన్, యోగిబాబు,బాబు ఆంథోనీ ఇతర పాత్రల్లో నటిస్తుండగా ప్రిన్స్ పిక్చర్స్,ఐవివై ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా కార్తీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



