సూర్యతో కార్తి ఫైట్.. నాని పనేనా..?
on Apr 3, 2025
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రెట్రో'. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వరుస పరాజయాల్లో ఉన్న సూర్య.. రెట్రోతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే అనూహ్యంగా సూర్యతో ఆయన సోదరుడు కార్తి బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నాడు. కార్తి అతిథి పాత్రలో మెరవనున్న మూవీ అదే రోజు విడుదల కాబోతుంది. ఆ సినిమా ఏదో కాదు హిట్-3. (HIT 3)
నాని(Nani)కి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో రూపొందే 'హిట్' ప్రాంఛైజ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. శైలేశ్ కొలను దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంఛైజ్ లో ఇప్పటిదాకా రెండు సినిమాలు రాగా.. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ నటించారు. మూడో భాగంలో నాని నటిస్తున్నాడు. 'హిట్-3' మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 'హిట్-3'లో మరో హీరో ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
హిట్-3 మూవీలో అతిథి పాత్రలో ఒక హీరో కనిపిస్తాడని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ, రవితేజ, దుల్కర్ సల్మాన్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వీరెవరూ కాదు.. ఇందులో కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'హిట్-2' చివరిలో నాని పాత్రను పరిచయం చేసి, 'హిట్-3'కి లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'హిట్-3'లో కూడా కార్తి పాత్రను అలా ఇంట్రడ్యూస్ చేసి, 'హిట్-4'కి లీడ్ ఇస్తారేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
