శ్రీకాళహస్తిలో పూజాహెగ్డే రాహు కేతు పూజలు
on Apr 3, 2025
'ఒక లైలా కోసం'మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ముంబై భామ పూజాహెగ్డే(Pooja Hegde),ఆ తర్వాత ముకుంద,దువ్వాడ జగన్నాధం,అరవిందసమెత వీర రాఘవ,సాక్ష్యం,రాధేశ్యామ్,అల వైకుంఠపురం,మహర్షి, ఆచార్య,గద్దల కొండ గణేష్ ఇలా పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ని పొందింది.తమిళ,హిందీ చిత్రాల్లో కూడా నటించి తన సత్తా చాటిన పూజాహెగ్డే 2022 లో రిలీజైన ఎఫ్ 3 లో చిన్న క్యామియో రోల్ లో కనిపించింది.
రీసెంట్ గా పూజాహెగ్డే ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోని 'శ్రీకాళహస్తి'(Srikalahasthi)లో వాయులింగేశ్వరుడి గా కొలువు తీరిన మహిమానిత్వమైన శ్రీ కాళహస్తీశ్వరుడి క్షేత్రాన్ని సందర్శించింది.ఈ క్షేతం రాహు కేతు పూజలకి ప్రసిద్ధి చెందింది కావడంతో రాహు కేతు పూజలు చేయించుకున్న పూజా ఆ తర్వాత స్వామిని దర్శించుకుంది.ఆలయంలోనే జ్ఞానానికి ప్రతీకగా వెలసిన 'శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని కూడా దర్శించుకొని పూజలు చేసింది.పూజారులు ఆశీర్వచనాలు అందచేయడంతో పాటుగా తీర్ధ ప్రసాదాలు అందచేసారు.అధికారులు ఆలయ విశిష్టిత గురించి చెప్పడంతో పాటు స్వామి వారి చిత్ర పటాన్ని బహూకరించి శాలువాతో సత్కరించారు.
పూజాహెగ్డే ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్(VIjay)ప్రెస్టేజియస్ట్ మూవీ జనగన నాయగాన్ తో పాటు సూర్య(Suriya)తో రెట్రో మూవీలోను చేస్తుంది.ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా రెట్రో మే 1 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
