డాకుమహారాజ్,గేమ్ చేంజర్ పై హైకోర్టులో కేసు..అభిమానుల్లో టెన్షన్
on Jan 8, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ,(Balakrishna)గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan)ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'(Daku Maharaj)(Game Changer)'గేమ్ చేంజర్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.'గేమ్ చేంజర్'10 న రిలీజ్ అవుతుండగా 'డాకు మహారాజ్' 12 న విడుదల కానుంది.ఆ ఇద్దరి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ రెండు సినిమాల మీద,అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ రెండు సినిమాలు ఎంతో భారీ ఎత్తున నిర్మాణం జరుపుకున్నాయి.ఈ కోణంలో ఆలోచించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,మొదటి రెండు వారాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.అధికారకంగా ఒక జీవో కూడా జారీ చెయ్యగా,ఇప్పుడు ఆ జీవోని వ్యతిరేకరిస్తు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ లో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది.సినిమాకి బెనిఫిట్ షో అనుమతి ఇవ్వడం వల్ల శాంతి భద్రతాసమస్యలు తలెత్తుతాయి.ఈ విధంగా బెనిఫిట్ షో వేయడం వల్ల హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఒక మహిళ చనిపోయింది.ఈ విషయంపై పోలీసు కేసు కూడా నమోదయ్యిందంటు,కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ ని కూడా పిటిషినర్ జత చేయడం జరిగింది. .నిబంధలకి విరుద్ధంగా టికెట్ రేట్స్ కూడా పెంచారని పిటిషన్ లో పేర్కొన్నాడు.దీంతో ఈ రోజు రాబోయే హైకోర్టు తీరుపై మేకర్స్ తో పాటు హీరోల అభిమానుల్లో కూడా టెన్షన్ నెలకొని ఉంది
'గేమ్ చేంజర్' బెనిఫిట్ షో టికెట్ 600 రూపాయిలు ఉండేలా,మల్టిప్లెక్స్ టికెట్స్ మీద 135 రూపాయలు,సింగిల్ స్క్రీన్ 110 రూపాయలు పెంచుకోవచ్చని చెప్పింది.డాకు మహారాజ్ కి కూడా ఆ రేట్స్ నే వర్తించగా బెనిఫిట్ షో కి మాత్రం 500 గా టికెట్ ని నిర్ణయించింది.సినిమా నిర్మాణానానికి అయిన ఖర్చు ఆధారంగానే 'గేమ్ చేంజర్, డాకు మహారాజ్' సినిమాల టికెట్ రేట్స్ ని ఏపి ప్రభుత్వం పెంచడం జరిగింది.
Also Read