విశాల్ ఆరోగ్య పరిస్థితిపై ఖుష్భు కీలక వ్యాఖ్యలు
on Jan 8, 2025
విశాల్(Vishal)లాస్ట్ ఇయర్ 'మార్క్ ఆంథోనీ'అనే మూవీతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పొంగల్ కానుకగా ఈ నెల 12 న 'మదగజరాజా' అనే యాక్షన్ కామెడీ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.11 ఏళ్ళ క్రితమే నిర్మాణం జరుపుకున్న ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్స్ లో సందడి చేయనుంది.చిత్ర బృందం గత ఆదివారం ఒక ఈవెంట్ ని నిర్వహించగా అందులో విశాల్ పరిస్థితి చూసిన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యారు.
విశాల్ బాగా సన్నబడంతో పాటు మాట్లాడేటప్పుడు వణుకుతూ కూడా కన్పించాడు.దీంతో విశాల్ కి పెద్ద వ్యాధి సోకిందని కొందరు,లేదు లేదు లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల అలా మారిపోయాడంటూ మరొకొందరు ఇలా ఎవరకి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు.ఇప్పుడు ఆ రూమర్స్ పై ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ(Kushboo)ఫైర్ అవుతున్నారు.ఆమె మాట్లాడుతు విశాల్ కి డెంగీ ఫీవర్ సోకింది.దాదాపుగా 103 డిగ్రీల ఫీవర్ ఉన్న కూడా విశాల్ ఈవెంట్ కు వచ్చారు.ఎంతో కష్టపడి డెడికేషన్ తో మదగజరాజాలో వర్క్ చేసాడు.తనంటే నాకు ఎంతో గౌరవం.ఇద్దరం కలిసి వర్క్ కూడా చేసాం.దయ చేసి అలాంటి రూమర్స్ ని పోస్ట్ చేయవద్దని కోరింది.చెన్నైలో జరిగిన ఈవెంట్ కి ఖుష్బూ హాజరయిన విషయం తెలిసిందే.
హిట్ చిత్రాల దర్శకుడు సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మదగజరాజా'లో విశాల్ సరసన వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar)అంజలి(Anjali)హీరోయిన్లుగా చెయ్యగా సోను సూద్ విలన్ రోల్ ని పోషించాడు.సంతానం,మనోబాల,వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించగా విశాల్ నే నిర్మాతగా వ్యవహరించాడు.మూవీ విజయంపై చిత్ర బృందం అయితే మంచి నమ్మకంతో ఉంది.ప్రముఖ హీరో విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Also Read