‘దేవర’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌లో తన స్టామినా చూపిన ఎన్టీఆర్!
on Oct 4, 2024
స్టార్ హీరోల సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి పవర్ ఫుల్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే ముందు నుంచే రికార్డుల మోత మోగుతుంది. గత వారం విడుదలైన ఎన్టీఆర్ సినిమా ‘దేవర’కి కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లపరంగా దాని ప్రభావం అంతగా లేదని ఫిగర్స్ చూస్తుంటే తెలుస్తోంది. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా రూ.365.89 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. కేవలం ఆరు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయిందంటే.. సినిమాకి ఎలాంటి ఆదరణ లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. ఇక్కడ కూడా ఊహకందని కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది ‘దేవర’.
7వ రోజు రెండు రాష్ట్రాల కలెక్షన్స్..(కోట్లలో)
నైజాం.. 1.02
సీడెడ్.. 0.73
వైజాగ్.. 0.24
ఈస్ట్.. 0.19
వెస్ట్.. 0.12
కృష్ణా.. 0.11
గుంటూరు.. 0.11
నెల్లూరు.. 0.12
టోటల్‌గా 7వ రోజు కలెక్షన్ రూ.2.64 కోట్లు
టోటల్‌గా 7 రోజుల కలెక్షన్స్(కోట్లలో)
నైజాం.. 42.48
సీడెడ్.. 22.99
వైజాగ్.. 11.43
ఈస్ట్.. 7.07
వెస్ట్.. 5.60
కృష్ణా.. 6.39
గుంటూరు.. 9.30
నెల్లూరు.. 4.41
టోటల్‌గా 7 రోజుల కలెక్షన్ రూ.109.67 కోట్లు
టోటల్‌గా 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ.365.89 కోట్లు
Also Read