అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ లో బిగ్ సర్‌ప్రైజ్..!
on Apr 8, 2025
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తల్లీకొడుకుల కథతో తెరకెక్కుతోన్న ఈ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రంలో.. వైజయంతిగా విజయశాంతి, అర్జున్ గా కళ్యాణ్ రామ్ అలరించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. (Arjun Son Of Vyjayanthi)
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ వచ్చింది. రన్ టైమ్ ను 2 గంటల 24 నిమిషాలకు లాక్ చేశారు. ఈ మూవీ సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉంది. యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ లా మలిచారట. ముఖ్యంగా కళ్యాణ్ రామ్-విజయశాంతి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వచ్చాయని.. ఈ సీన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడం ఖాయమని అంటున్నారు. అలాగే, క్లైమాక్స్ బిగ్ సర్‌ప్రైజ్ అని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ సైతం ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఇలాంటి క్లైమాక్స్ రాలేదని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొత్తానికి మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే కంటెంట్ తో వస్తున్న కళ్యాణ్ రామ్.. ఈ వేసవికి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
