నయనతార రికార్డు ఎవరికైనా ఉందా..వరుసగా తొమ్మిది అంటే మాటలా
on Apr 8, 2025
హీరోలకే కాదు హీరోయిన్ లకి కూడా లాంగ్ రన్ ఉంటుందని నిరూపించిన వాళ్ళల్లో నయనతార(Nayanthara)కూడా ఒకటి.ఇందుకు నిదర్శనంగా రెండు దశాబ్డల నుంచి అన్నిభాషలకి చెందిన చిత్రాల్లో నటిస్తు లేడీ సూపర్ స్టార్ అనే టాగ్ లైన్ తో ముందుకు దూసుపోతుంది.ప్రస్తుతం నయన్ చేతిలో ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ కి లేని విధంగా తొమ్మిది సినిమాలు ఉన్నాయి.మరి అవేంటో చూసేద్దాం.
ఈ లిస్ట్ లో మొదటిది 'మన్నాంగట్టి సిన్స్ 1960 'అనే తమిళ చిత్రం.యూట్యూబర్ 'డ్యూడ్ విక్కీ' దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో నయన్ తారే ప్రధాన పాత్ర పోషిస్తుంది.రెండవది కన్నడ సూపర్ స్టార్ యష్(yash)అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్'(Toxic).గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.మూడవది డియర్ స్టూడెంట్స్ అనే మలయాళ చిత్రం కాగా నివిన్ హీరోగా చేస్తున్నాడు.ఇక నాలుగవది 'రాకాయి' అనే పాన్ ఇండియా చిత్రం కాగా సెంథిల్ నలస్వామి దర్శకుడు.ఐదవది ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'ముక్కుతి అమ్మన్' కాగా నయన్ అమ్మవారిగా చేస్తుంది.ఆరో సినిమాగా మలయాళంలో మమ్ముట్టి,మోహన్ లాల్ తో కలిసి చేస్తుండగా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
ఏడో చిత్రాన్ని దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలోను,ఎనిమిదో సినిమా జయం రవి(Jayam Ravi)కి జంటగా చేస్తుండగా టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు.తొమ్మిదో సినిమాగా'హాయ్'అనే కొత్త చిత్రాన్నిలైన్ లో పెట్టింది.ఇలా మొత్తం తొమ్మిది సినిమాలని లైన్ లో పెట్టి నయన్ ఫుల్ బిజీగా ఉంది.పైగా వీటిల్లో ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే చిత్రాలే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
