100 కోట్లు ఇచ్చినా కూడా అందులో అడుగుపెట్టనంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
on Dec 21, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ 'బద్రి'.ఈ మూవీ ద్వారా తెలుగు తెరకి పరిచయమైన భామ 'అమీషా పటేల్'(ameesha patel).సరయు అనే క్యారక్టర్ లో సూపర్ గా నటించి తెలుగు నాట ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.ఆ తర్వాత మహేష్ బాబుతో నాని,ఎన్టీఆర్ తో 'నరసింహుడు' అనే సినిమాల్లో కూడా చేసింది.బాలీవుడ్ లో కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన అమీషా గత సంవత్సరం గదర్ 2 అనే సినిమా చేసింది.సన్నీడియోల్ హీరోగా వచ్చిన ఈ మూవీని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించాడు.
కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో అమీషాని ఉద్దేశించి అనిల్ శర్మ మాట్లాడుతు అత్త క్యారక్టర్ లో నటించడానికి అమీషా అంగీకరించలేదు.నర్గిస్ దత్ వంటి గొప్ప తారలు కూడా అత్తయ్య పాత్రలు చేసారని
అమీషాకి నచ్చచెప్పా.అయినా సరే ఆమె మాత్రం చేయనని చెప్పిందనే విషయాన్నీ సదరు ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై అమీషా స్పందిస్తు'డియర్ అనిల్ ఇది కేవలం సినిమా మాత్రమే.నిజజీవితంలో ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు.కాబట్టి ఆన్ స్క్రీన్ లో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదనేది పూర్తిగా నా వ్యకిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.'గదర్'అనే కాదు ఏ మూవీలో అయినా కూడా అత్త క్యారెక్టర్స్ చెయ్యను.మీరంటే నాకు ఎంతో గౌరవం ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసింది.ఇప్పడు ఈ కామెంట్స్ బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.
గతంలో కూడా అనిల్ పై అమీషా కొన్ని ఆరోపణలు చేసింది.తన కొడుకు ఉత్కర్ష్ శర్మ కోసం గదర్ 2 లోని క్లైమాక్స్ సీన్ ని,తనతో ఒక మాట కూడా చెప్పకుండా మార్చేసాడని చెప్పుకొచ్చింది.ఇక 'గదర్ 2 'లో సన్నీడియోల్ భార్య సకీనా క్యారక్టర్ లో అమీషా ఎంతో అధ్బుతంగా చేసింది.60 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 600 కోట్ల దాకా వసూలు చేసింది.గదర్ 3 కూడా ఉందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో,మరి అమీషా అందులో ఉంటుందా లేదా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది.
Also Read