మళ్లీ మొదలుపెట్టారా? ఇక ఆపండి.. సీరియస్ అయిన త్రిష!
on Nov 16, 2025
సాధారణంగా హీరోయిన్లకు ఎక్కువ స్పాన్ ఉండదు. కొన్ని సంవత్సరాలు మాత్రమే వారి హవా కొనసాగుతుంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతుంటారు. తనకి జంటగా నటించిన హీరోకే అమ్మగా నటించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ, రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష మాత్రం ఇప్పటికీ హీరోయిన్‌గా అందర్నీ అలరిస్తోంది.
ఇదిలా ఉంటే.. త్రిష చుట్టూ ఎప్పుడు పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇటీవలికాలంలో ఆమె పెళ్లికి సంబంధించిన రూమర్స్ బాగా పెరిగిపోయాయి. 41 ఏళ్లు దాటినప్పటికీ త్రిష ఇంకా సింగిల్‌గానే ఉండటం, మరో పక్క వరసగా సినిమాలు చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి గుసగుసలు ఎక్కువయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితం హీరో విజయ్‌తో త్రిషకు ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అవి బాగా హల్‌చల్ చేశాయి. విజయ్ పుట్టినరోజున ఒక కుక్క పిల్లతో విజయ్ ఫోటో సోషల్ మీడియాలో వచ్చింది. పక్కన త్రిష ఉండడం.. ఈ రూమర్స్‌కి బలాన్ని చేకూర్చింది. అప్పట్లో ఈ ఫోటో బాగా వైరల్ అయింది. దీనిపై త్రిష ఫైర్ అయిందని టాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి.
తనపై లేనిపోని రూమర్స్ పుట్టిస్తున్న వారిపై మండిపడిరది త్రిష. తనకు ఎంతో మంది స్నేహం ఉండొచ్చు. అంత మాత్రాన వారందర్నీ తన భర్తలుగా చూపించడం చాలా తప్పు అంటూ కామెంట్ చేసింది. ‘స్నేహితులతో ఉన్న ఫోటోలను చూసి పెళ్లి వార్తలు రాయడం అసహ్యం వేస్తుంది. ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారం ఆపండి అంటూ త్రిష వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, తన వ్యక్తిగత విషయాల గురించి అనవసరమైన రాతలు రాయడం వల్ల తన ఇమేజ్ దెబ్బతింటుందని చెబుతోంది త్రిష. ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



