మరో షాకిచ్చిన ప్రభాస్.. కొత్త దర్శకుడితో భారీ పాన్ ఇండియా మూవీ!
on Nov 15, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఎక్కువగా ఊహించని దర్శకులతో చేతులు కలుపుతూ సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక కొత్త దర్శకుడితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్.. సేఫ్ గేమ్ ఆడకుండా విభిన్న జానర్స్ లో సినిమాలు ట్రై చేస్తున్నారు. అంతేకాదు, స్టార్ డైరెక్టర్స్ తోనే పని చేయాలనే రూల్ పెట్టుకోకుండా.. యంగ్ డైరెక్టర్స్ కి ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ అలా చేసినవే. అలాగే ఎవరూ ఊహించని విధంగా మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఫిల్మ్ 'ది రాజా సాబ్'కి శ్రీకారం చుట్టారు. అదే బాటలో హను రాఘవపూడి డైరెక్షన్ లో పీరియడ్ ఫిల్మ్ 'ఫౌజీ' చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ కి గొప్ప పేరుంది. ముఖ్యంగా 'నాటు నాటు' సాంగ్ ఆయనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాంటి ప్రేమ్ రక్షిత్, ఇప్పుడు చిత్ర దర్శకుడిగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఓ అద్భుతమైన కథతో ఇప్పటికే ప్రభాస్ ని ఇంప్రెస్ చేశారని సమాచారం. గ్రాఫిక్స్ తో ముడిపడిన ఓ విజువల్ వండర్ లా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని న్యూస్ వినిపిస్తోంది.
Also Read: గూస్ బంప్స్ తెప్పిస్తున్న అఖండ తాండవం సాంగ్
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్' సినిమాలు ఉన్నాయి. 'ది రాజా సాబ్' 2026 సంక్రాంతికి విడుదల కానుండగా, 'ఫౌజీ'ని ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'స్పిరిట్' త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. 2026 చివర్లో విడుదలయ్యే అవకాశముంది. స్పిరిట్ తర్వాత ప్రేమ్ రక్షిత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
అలాగే 'కల్కి-2', 'సలార్-2' కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. ఇవి కాకుండా, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



