సుచిత్ర కిడ్నాప్ అయ్యిందా.? దీని వెనుక ఎవరున్నారు..?
on Mar 22, 2017

సుచీ లీక్స్‌తో టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోలు, హీరోయిన్లు, టాప్ మోస్ట్ టెక్నీషియన్స్‌కి ముచ్చెమటలు పట్టించింది ప్రముఖ సింగర్ సుచిత్ర. రోజుకో సెలబ్రిటీల పర్సనల్ ఫోటోస్, వీడియోస్‌ని ట్విట్టర్‌లో పెట్టిన ఆమె..తర్వాతి రోజు వీళ్లదే అంటూ ముందు రోజు ప్రకటించి మరీ రహస్యాలు వెల్లడించడంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అలాగే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది.
అయితే ఆ వీడియో పెడతాం..ఈ వీడియో పెడతాం అంటూ సుచీలీక్స్‌లో ప్రకటించినా..ఆ తర్వాత ఉలుకు పలుకూ లేకుండా పోయింది. దీంతో సుచీలీక్స్ కథ ఇక సుఖాంతం అయ్యినట్లేనని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. సుచిత్ర కిడ్నాప్‌కు గురయ్యారంటూ కోలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సుచీలీక్స్ వల్ల నష్టపోయిన కొందరు ఈ పనిచేశారంటూ పుకార్లు షికారు చేస్తుండటంతో చెన్నైలో తీవ్ర కలకలం రేగింది. ఇంతకీ సుచిత్ర ఎక్కడ ఉన్నట్లు..ఏం చేస్తున్నట్లు..ఆమె బయటకు వస్తే కానీ ఈ గందరగోళానికి తెర పడే సూచనలు కనిపించడం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



