ఎప్పుడూ అవే తీస్తాడు..మణిరత్నంపై సుహాసిని అసహనం
on Mar 22, 2017

మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితి హైదరీ జంటగా తమిళంలో రూపొందుతున్న "కాట్రు వెలియదై" ను తెలుగులో చెలియా పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు ఆడియో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మణిరత్నం భార్య సినీనటి సుహాసిని తన భర్త గురించి మాట్లాడారు.. ఆయన సినిమాలకు నేనే బెస్ట్ క్రిటిక్‌ని. కెరిర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రోమాంటిక్ సినిమాలే చేస్తున్నావ్..నీకు వేరేది చేయడం రాదా.? బోర్ కొట్టదా అని నేను మణిని అడుగుతుంటాను. దానికి నవ్వి ఊరుకుంటారు తప్ప సమాధానం చెప్పరు అని నవ్వుతూ అసహనం ప్రదర్శించారు సుహాసిని.
ప్రేక్షకుల సంగతేమో కాని నాకైతే ఆ రోమాంటిక్ మూవీస్ చూడలేక బోర్ కొడుతోంది అన్నారు. ఇంతలో యాంకర్ కలగజేసుకుని సార్ వయసు పెరుగుతున్నా రోజు రోజుకి యంగ్ అవుతున్నారు..అది ప్రూవ్ చేయడానికే రోమాంటిక్ మూవీస్ చేస్తున్నారు అనేసరికి ఆడిటోరియం మొత్తం నవ్వులు పూశాయి. మొత్తానికి మణిరత్నం ఒకే జోనర్‌లో సినిమాలు తీయడం ఆయన భార్యకే నచ్చడం లేదన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



