శర్వానంద్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు..?
on Mar 1, 2017

ఇటీవల వరుస సూపర్‌హిట్లతో ఫుల్ జోష్ మీదున్నాడు యంగ్ హీరో శర్వానంద్. తాజాగా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు వరకు 2 నుంచి రెండున్నర కోట్ల వరకు తీసుకుంటున్న శర్వానంద్ తాజాగా శతమానం భవతి హిట్ అవ్వడంతో కొత్త సినిమాకు మూడున్నర కోట్లు అడిగాడట. దీంతో సదరు నిర్మాతకు కళ్లు బైర్లుకమ్మాయట.
నిన్న మొన్నటి వరకు ప్రొడ్యూసర్ల హీరోగా ముద్రపడిన శర్వానంద్ ఇలా మారిపోవడం వెనుక కారణం ఉంది. శర్వా నటించిన రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా లేటేస్ట్‌గా శతమానం భవతి సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను రాబట్టాయి..దీంతో ఈ హీరోకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్ వచ్చింది. తన మార్కెట్ పెరగడంతో శర్వానంద్ రెమ్యూనరేషన్ కూడా పెంచాలని డిసైడ్ అయ్యాడు. ఆ మాటే ప్రొడ్యూసర్స్ వద్ద చెప్పాడు..కాని ఈ మాటను జీర్ణించుకోనే పరిస్థితుల్లో నిర్మాతలు లేరని అనిపిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



