ఆమెతో ఎఫైరే అఖిల్ కొంప ముంచిందా?
on Mar 1, 2017

అఖిల్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో ఇప్పటికీ హాట్ హాట్ టాపిక్‌గా ట్రెండింగ్‌లో ఉంది. బ్రేకప్ వెనుక స్పష్టమైన కారణాలు ఏవీ తెలియకపోయినా.. రకరకాల గాసిప్పులు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. అఖిల్‌కీ శ్రియా రెడ్డికి ఏవో విషయంలో గొడవలు వచ్చాయని, అవి చినికి చినికి గాలివానగా మారాయని, శ్రియా రెడ్డి అఖిల్ ఫ్యామిలీకి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం లేదని, ఆ విషయంలో ముందు నుంచీ అఖిల్ గుర్రుగానే ఉన్నాడని, ఎంగేజ్ మెంట్ రోజున.. శ్రియా రెడ్డి బిహేవియర్ నాగ్ ఫ్యామిలీకి ఏమాత్రం నచ్చలేదని ఇలా రకరకాల కామెంట్లు వినిపించాయి.
అయితే.. ఇప్పుడు మరో హాట్ గాసిప్ బయటకు వచ్చింది. ఈ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయి, పెళ్లి రద్దు అవ్వడానికి కారణం అఖిల్ కి ఉన్న ఇతరత్రా ఎఫైర్లే అన్నది క్లోస్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట. అఖిల్‌కి ఓ అమ్మాయితో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆ అమ్మాయి ఇండ్రస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని, ఓ స్పోర్ట్స్ సెలబ్రెటీ అని, తన ఆట కంటే అందంతో కట్టిపడేసే ఆమె తెలుగమ్మాయే అని.. కొంతకాలంగా అఖిల్‌కీ, ఆమెకూ ఫ్రెండ్ షిప్ నడుస్తోందని, అది నచ్చకే శ్రియా రెడ్డి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని పట్టుపట్టిందని తెలుస్తోంది. ఆ క్రీడా కారిణి ఎవరు? ఈ ఎఫైర్ నిజమేనా?? అంటూ ఆసక్తిగా చర్చించుకొంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అఖిల్ గానీ, లేదంటే నాగార్జున గానీ ఈ విషయంలో ఏదో ఓ స్పష్టమైన ప్రకటన ఇచ్చేంత వరకూ ఇలాంటి గాసిప్పులు పుడుతూనే ఉంటాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



