చెర్రీ సినిమాతో ఆ వూరికి లాస్ట్ డే..!
on Apr 1, 2017

సినిమా అంటే ఒక చోట తీసేది కాదు..తమ సినిమా మిగిలిన వాటికన్నా భిన్నంగా వుండేందుకు దర్శకనిర్మాతలు ప్రపంచం మొత్తం వెతికి ఎవ్వరూ చూడని ప్రాంతాలను వెతికి మరి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పటి నుంచో తెలుగు సినిమాతో విడదీయరాని అనుబంధం ఉన్న ఓ ప్రాంతం త్వరలో జలసమాధి కాబోతోంది. అది మరెక్కడో కాదు తూర్పుగోదావరి జిల్లాలోని పూడిపల్లి.
ఈ లొకేషన్లో ఇప్పటి వరకు ఆపద్భాంధవుడు, త్రిశూలం, బంగారు బుల్లోడు, ఒక్కమగాడు, ప్రాణం వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు షూటింగ్ జరుపుకొన్నాయి. తాజాగా రామ్‌చరణ్-సుకుమార్ కాంభినేషన్లో తెరకెక్కుతున్న రేపల్లే మూవీ కూడా పూడిపల్లిలోనే షూటింగ్ జరుపుకోబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత ఈ గ్రామం కాలగర్భంలో కలిసిపోనుంది. ఎందుకంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో ఇదీ ఒకటి. దీంతో ఇక్కడి అందమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకునే చివరి సినిమా రామ్‌చరణ్‌దే. ఈ నేపథ్యంలో ఎంతో అందమైన షూటింగ్ స్పాట్‌గా పేరొందిన పూడిపల్లి గ్రామాన్ని రేపటి తరాలు చూసుకోవాలంటే సినిమాలే దిక్కన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



