పవన్‌కి వార్నింగ్ ఇచ్చిన మాజీ సీఎం బావమరిది..?
on Apr 3, 2017
.jpg)
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అన్నారు పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల ముందు హడావుడిగా ఆయన పార్టీ ప్రకటన చేయడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే తెర వెనుక నుంచి టీడీపీ, భాజాపాలకు ఆయన మద్దతు ఇవ్వడం... ఆ పార్టీలు రెండూ అధికారంలోకి రావడం ఈ ఎపిసోడ్లన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. `కాంగ్రెస్ కో హటావో.. దేశ్ కో బచావో` అనే నినాదం కూడా అప్పట్లో మార్మోగిపోయింది. అసలు పవన్ కి కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అంత మంట.? పవన్ రాజకీయాల్లోకి రావడానికి వెనుక కాంగ్రెస్ పట్ల విముఖత వైఖరీ ఓ కారణమేనా? అనే విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త షికారు చేస్తోంది. పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడన్నది ఆ వార్త సారాంశం.
అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్లోని పవన్ షూటింగ్ జరుపుకొంటున్న లొకేషన్‌కి వెళ్లారట. `నేనో సినిమా తీద్దామనుకొంటున్నా.. నువ్వు కాల్షీట్లు ఇవ్వాల్సిందే` అని రుబాబుగా మాట్లాడారట. `నేను సీఎమ్ బామ్మర్దిని తెలుసా` అంటూ బెదిరించార్ట. ఇలాంటి వాళ్ల చేతుల్లో అధికారం ఉంటే.. ఈ రాష్ట్రం ఏమైపోతుందో అని ఆరోజే పవన్ అనుకొన్నాడట. అందుకే... జగన్‌ని ఓడించడానికి 2014 ఎన్నికల సమయంలో పవన్ పార్టీ ప్రకటించి.. టీడీపీకి మద్దతు పలికాడట. ఇదీ ఆ వార్త సారాంశం. ఓ ప్రముఖ దిన పత్రిక ఎడిటోరియల్ వ్యాసం ఇదే కాబట్టి.. అంతో ఇంతో నమ్మాల్సిందే. వినడానికి ఈ కారణం చాలా సిల్లీగా అనిపిస్తోంది. పవన్ లాంటి వాడు ఇలాంటి బెదిరింపులకు భయపడ్డాడా?? వాళ్లపై పగ తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాడా?? ఏమో మరి ఈ సంగతి పవన్‌కీ.. ఈ కాలమ్ రాసిన పాత్రికేయునికే తెలియాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



