సెక్స్ ఆరోగ్యానికి మంచిది: రాధిక ఆప్టే
on Mar 28, 2015
చక్కగా చీరకట్టుని బావా బావా అంటే...మేటర్ లేకపోయినా మరదలు పిల్ల బాగానే ఉందిలే అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని స్టేట్ మెంట్ ఇచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఆకలేస్తే అన్నం ఎంత అవసరమో...శరీరానికి సెక్స్ కూడా అంతే అవసరం అని చాలా సింపుల్ గా తేల్చేసింది. విన్నవాళ్లంతా ఓసారి గిల్లి చూసుకున్నారట. ఇంతకీ చూస్తున్నది రాధికా ఆప్టేనా కాదా అని మళ్లీ మళ్లీ చెక్ చేసుకున్నారట. సాఫ్ట్ గా ఉంటే లెక్కలు తేలట్లే అనుకుందో ఏమో బద్లాపూర్ లో బికినీతో రెచ్చిపోయింది. ఆ తర్వాత వచ్చిన ' హంటర్' లోనూ సెమీన్యూడ్ గా సెగలు పుట్టించింది. పైగా సెక్స్ కోసం పరితపించే పాత్రలో థియేటర్లో ప్రేక్షకులకు చెమట్లు పట్టించింది. అయి బాబోయ్ రాధికా ఏంటిలా అంటే.... 'సెక్స్ క్వైట్ కామన్' అంతేనా....పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిదని కూడా క్లాసులిస్తోంది. బాలయ్య బేబీ బోల్డ్ కామెంట్స్ విని జనాలు నోరెళ్లబెడితే.... సెక్స్, ఎక్స్ పోజింగ్ అసలు పెద్ద మేటర్ కాదని తేల్చిపడేసింది. మరి ఇంత మేటరున్న రాధికను టాలీవుడ్ డైరెక్టర్స్ సరిగ్గా వాడుకోలేదా ఏంటి?