కప్పు అడిగితే చిప్ప ఇచ్చిన అనుష్క..!!
on Mar 28, 2015
వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్నట్టు.....టీమిండియా ఓటమికి కారణం ఆమె అంటూ గోలగోల చేసేస్తున్నారు కొందరు క్రికెట్ అభిమానులు. పంతం మీదా మాదా రేయ్ అంటూ...టీమిండియా ఆరంభం నుంచి అదుర్స్ అనిపించింది. మనోళ్లు ఇరగదీసేస్తున్నారు కప్పు పట్టుకుని వచ్చేస్తారులే అనుకుంటే చిప్పపట్టుకుని సైలెంట్ గా తిరిగొచ్చేసారు. పోరాడారు పోయారు దానిదేముంది అనుకున్న వాళ్లు కొందరతై....మొత్తం అనుష్క శర్మ చేసింది....అడుగుపెట్టిందో లేదో మ్యాచ్ ఓడిపోయాం అని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఒకటే సొద. ఆగండాగండి...ఇదే జనాలు మ్యాచ్ కు ముందు ఏమన్నారో తెలుసా.....! పీకల్లోతు ప్రేమలో ఉన్న విరాటుడు ప్రియురాలుని చూసి రెచ్చిపోతాడు.... ఇరగదీస్తాడు... పరుగులే పరుగులు అని హడావుడి చేశారు. తీరా మనోడు ఒకే ఒక్కటి కొట్టి తుస్సు మనిపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే విరాటుడి వికెట్ పడగానే రిజల్ట్ ఏంటో ఊహించేశారు. ఆ బాధలోపడి మతిచెడిన కొందరు అనుష్కను ఆడిపోసుకుంటున్నారు. ఈగోలంతా పక్కనపెడితే...ఇప్పుడింతకీ విరాట్-అనుష్కలో ఎవరు ఎవర్ని ఓదార్చుకుంటారో మరి. కప్ మిస్సైతే మిస్సైంది కానీ....ఉన్న మిస్ మిస్సవకుండా చూసుకో విరాట్ అని ఓ ఉచిత సలహా పడేస్తున్నారు.