సెన్సేషనల్ డేట్‌ని టార్గెట్ చేసుకున్న సెన్సేషనల్ కాంబో?
on Apr 20, 2020
ఒకరేమో డైరెక్టర్ నంబర్ వన్.. మరొకరేమో స్టార్ నంబర్ వన్.. అలాంటి ఈ ఇద్దరి సూపర్ కాంబినేషన్‌లో సినిమా కోసం కోట్లాదిమంది వెయిటింగ్. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు. చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న ఈ అరుదైన కలయికలో త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’తో బిజీగా ఉన్న జక్కన్న.. ఆ మల్టీస్టారర్ పూర్తవగానే మహేశ్ కాంబో ఫిల్మ్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఇటీవల ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా ప్రకటించాడు కూడా. కాగా, శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మించనున్న ఈ సినిమా.. పాన్ ఇండియా మూవీగా రిలీజయ్యే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. రాజమౌళి, మహేశ్ బాబు ఫస్ట్ కాంబినేషన్‌లో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. అటు రాజమౌళికి, ఇటు మహేశ్‌కి ఇండస్ట్రీ హిట్స్‌ని అందించిన సెన్సేషనల్ డేట్‌కి ఈ హై బడ్జెట్ వెంచర్ లాంచ్ కానుందట. ఇంతకీ ఆ డేట్ ఏంటనుకుంటున్నారా.. ఏప్రిల్ 28.
ఓ సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. 2006లో ఇదే ఏప్రిల్ 28కి మహేశ్ నటించిన ‘పోకిరి’ విడుదలై తెలుగునాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే, రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందిన ఫోక్‌లోర్ మూవీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ కూడా 2017లో ఇదే ఏప్రిల్ 28కి రిలీజై జాతీయ స్థాయిలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సో.. అంతటి చరిత్ర కలిగిన ఏప్రిల్ 28నే తమ కాంబినేషన్ ఫిల్మ్‌కి 2021లో ముహూర్తంగా ఫిక్స్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారట జక్కన్న, మహేశ్.
మరి.. సెన్సేషనల్ డేట్‌కి సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ – రాజమౌళి జాయింట్ వెంచర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
