ఓటీటీలోకి పుష్ప-2 ..!
on Jan 24, 2025
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2: ది రూల్' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి, సంచలన వసూళ్లతో తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన పుష్ప-2 ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Pushpa 2 The Rule)
పుష్ప-2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. పుష్ప-2 విడుదలై జనవరి 30తో ఎనిమిది వారాలు పూర్తవుతుంది. ఈ లెక్కన జనవరి 31 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. (Pushpa 2 On Netflix)
పుష్ప-2 మొదట థియేటర్లలో 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైంది. ఆ తర్వాత మరో 20 నిమిషాలు జోడించి, రీలోడెడ్ వెర్షన్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి 3 గంటల 40 నిమిషాల నిడివితో లేదా అంతకంటే ఎక్కువ నిడివితో వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
