విడాకులకు రెడీ అయిన కలర్స్ స్వాతి.. కారణమేంటి..?
on Jan 24, 2025
పెళ్లి చేసుకునేది.. విడాకులు తీసుకోవడానికే..’ ఈ కామెంట్ సినీ పరిశ్రమకు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అందులోనూ కొన్ని సినీ జంటలు దీన్ని అక్షరాలా పాటిస్తున్నాయి. కొంతకాలం ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం. అలాగే కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకోవడం కూడా ఇక్కడ అంతే సహజం. ఎప్పటికప్పుడు కొన్ని జంటలు దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలికాలంలో ఎంతో మంది ప్రముఖులు కొన్ని దశాబ్దాలపాటు కలిసి ఉండి తాము విడిపోతున్నామంటూ ప్రకటించడం మనం చూస్తున్నాం. ఇప్పుడా జాబితాలో కలర్స్ స్వాతి కూడా చేరబోతోందా? అనే చర్చ మొదలైంది. జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్వాతి వైవాహిక బంధం బీటలు వారినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటి అనేది తెలియజేయనప్పటికీ నెటిజన్లకు మాత్రం పూర్తి క్లారిటీ వచ్చేసింది. అసలు కలర్స్ స్వాతికి సంబంధించిన వార్త ఇప్పుడు వెలుగులోకి రావడానికి కారణం ఏమిటి, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఇటీవలికాలంలో సెలబ్రిటీలు తమ భాగస్వామితో విడిపోతున్నట్టు తెలియజేసేందుకు ముందుగా సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేస్తున్నారు. ఆ జంట విడిపోతోంది అని తెలియజెప్పేందుకు అది ఒక హింట్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పద్ధతినే చాలా మంది ఫాలో అయ్యారు. ఇప్పుడు కలర్స్ స్వాతి, వికాస్ విషయంలో కూడా ఇదే ప్రాతిపదికగా కనిపిస్తోంది. తమ పెళ్లి ఫోటోలు, భర్త వికాస్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది స్వాతి. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు వికాస్ ఎకౌంట్‌ను స్వాతి అన్‌ఫాలో చేసినట్టుగా కూడా తెలుస్తోంది. 2023లో నవీన్ చంద్ర, స్వాతి కలిసి నటించిన మంత్ ఆఫ్ మధు చిత్రం ప్రమోషన్స్ జరిగిన తర్వాత స్వాతి, వికాస్ విడిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అప్పుడు స్వాతి దీనిపై స్పందిస్తూ అవన్నీ తప్పుడు ప్రచారాలనీ, ఎవరూ నమ్మొద్దని చెప్పారు. తాజాగా ఈ జంటపై జరుగుతున్న ప్రచారం విషయంలో మాత్రం స్వాతి ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం.
2018లో స్వాతి, వికాస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం తగ్గించారు స్వాతి. 2023లో విడుదలైన మంత్ ఆఫ్ మధుపై ఆమె ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కానీ, ఆ సినిమా విజయం సాధించలేదు. పెళ్లి తర్వాత భర్త వికాస్‌తో కలిసి ఉన్న ఫోటోలను చాలా సార్లు షేర్ చేశారు స్వాతి. విదేశాలకు వెళ్లినపుడు కూడా అక్కడి నుంచే తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవారు. మరి వీరి మధ్య ఎలాంటి మనస్ఫర్థలు ఉన్నాయి, విడిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు, ఈ వార్తలో నిజమెంత వంటి విషయాలు స్వాతి స్పందిస్తేనే అందరికీ తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం ఏదీ జరిగినట్టు లేదు. మరి ఈ విషయంలో స్వాతి ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
