బాలయ్య రాజశేఖర్‌కి లక్ తెచ్చిపెడుతాడా..?
on Oct 18, 2017
ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలతో అందరిని ఆకట్టుకొన్న జగపతిబాబు హీరోగా తన పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో నందమూరి బాలకృష్ణ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ మూవీలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు జగపతి. ఆ తర్వాత వరుసపెట్టి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకొని.. ఇప్పుడు సౌతిండియాలోనే మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయాడు జగపతిబాబు.
తాజాగా యాంగ్రీ యంగ్‌మెన్‌గా.. పవర్‌ఫుల్ పాత్రలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకొన్న రాజశేఖర్‌కి అలాంటి లక్ తెచ్చిపెడతానంటున్నారు బాలయ్య. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే బాలకృష్ణ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా కనిపించబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన "పీఎస్‌వీ గరుడవేగ" ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను బాలకృష్ణ గారి సినిమాతో విలన్‌గా మారుతున్నట్లు స్వయంగా ప్రకటించాడు రాజశేఖర్. బాలయ్య హీరోగా, రాజశేఖర్ విలన్‌గా ఓ స్టోరీలైన్ రాసుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ స్టోరీ బేస్ బాలయ్యకు బాగా నచ్చిందట. ఈ ప్రాజెక్ట్‌తోనే ప్రతినాయకుడిగా ఎంట్రీ ఇస్తాడట రాజశేఖర్. మరి ఈ సినిమా పట్టాలపైకి ఎక్కుతుందా లేదా అన్నది అతి త్వరలోనే తేలిపోనుంది.