‘ధూమ్4’లో ప్రభాస్, అల్లు అర్జున్.. ఇది కదా కాంబో అంటే..!
on Jan 15, 2025
‘ధూమ్’ సిరీస్‌కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 2004లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో 2006లో ‘ధూమ్2’ వచ్చింది. 2013లో ‘ధూమ్3’ రిలీజ్ అయింది. ఈ మూడు సినిమాలూ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాల స్టైలిష్ మేకింగ్, టేకింగ్ ఆడియన్స్‌ని థ్రిల్ చేశాయి. ఈ మూడు సినిమాల్లో ‘ధూమ్2’ పాన్ ఇండియా లెవల్‌లో కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ‘ధూమ్3’లో ఆమిర్‌ఖాన్ నటించినప్పటికీ ‘ధూమ్2’ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా కలెక్షన్లు బాగానే రాబట్టింది. ‘ధూమ్’ సిరీస్‌లో నెగెటివ్ క్యారెక్టర్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో జాన్ అబ్రహం, హృతిక్‌రోషన్, ఆమిర్‌ఖాన్ వంటి హీరోలు ఆ క్యారెక్టర్లు చెయ్యడానికి ఉత్సాహం చూపించారు.
మొదటి రెండు భాగాలకు సంజయ్ గాధ్వి దర్శకత్వం వహించగా మూడో పార్ట్‌ని విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ అంతటి విజయం సాధించినప్పటికీ ఇప్పటివరకు ‘ధూమ్4’కి శ్రీకారం చుట్టలేదు యష్ రాజ్ ఫిలింస్. నాలుగో భాగం కూడా రాబోతోందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ సినిమాకి సంబంధించి క్యాస్టింగ్ విషయంలో ప్రొడక్షన్ హౌస్ సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది. ‘ధూమ్4’లో ప్రధాన పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో వారికి కన్‌ఫ్యూజన్ ఉందని సమాచారం. నెగెటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర కోసం రణబీర్ కపూర్‌ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ‘యానిమల్’ చిత్రంతో సంచలన విజయం సాధించిన రణబీర్ కపూర్ అయితే యాప్ట్ అని యష్‌రాజ్ సంస్థ భావిస్తోంది.
‘ధూమ్’ సిరీస్‌లోని మూడు భాగాల్లో అభిషేక్ బచ్చన్ కనిపిస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిషేక్ ఒదిగిపోయినప్పటికీ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో అభిషేక్‌కి ఈ సిరీస్ వల్ల ప్లస్ అయిందేమీ లేదు. నాలుగో భాగంలో అభిషేక్‌ను తప్పించి సౌత్ హీరోకి అవకాశం ఇవ్వాలని సంస్థ భావిస్తోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీని కోసం ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. అతనితోపాటు అల్లు అర్జున్‌ని కూడా ఈ సినిమాలో భాగం చెయ్యాలని ప్రొడక్షన్ హౌస్ భావిస్తోందట. ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు అలాంటి క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకుంటారా? లేదా? అనేది సందేహమే. మూడు భాగాల్లోనూ నెగెటివ్ క్యారెక్టర్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కోసం ప్రభాస్‌ని, అల్లు అర్జున్‌ని సంద్రించి ఉంటే చేసేవారేమో. మరి ఈ విషయంలో యష్ రాజ్ ఫిలింస్, మన హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read