బాలయ్య ఇమేజ్ ఏంటీ..? ఆ టైటిల్ ఏంటీ..?
on Mar 22, 2017

గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమాను ఎవరి దర్శకత్వంలో చేస్తారు..? కథ ఎలా ఉండబోతుంది అంటూ రకరకాల ప్రశ్నలు అభిమానులను వేధించాయి. బాలయ్యను డైరెక్ట్ చేసేందుకు కేఎస్ రవికుమార్, కృష్ణవంశీ, సింగీతం శ్రీనివాస్, శ్రీవాస్ లాంటి డైరెక్టర్లు క్యూ కట్టారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఇలా ఉంటే తన చిత్రాలకు వెరైటీ టైటిల్స్ పెట్టే పూరి ఈ మూవీకి ఎలాంటి టైటిల్ పెడతాడా అని సోషల్ మీడియాలో పెద్ద డిష్కసన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాకి "టపోరి" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. బాలయ్య అంటేనే పవర్‌ఫుల్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు..అందుకు తగ్గట్టే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టేవారు దర్శకులు. మరి ఆ ఆనవాయితిని కాదని..ఫ్యాన్స్‌ని పక్కనపెట్టి పూరి కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడా..? అయితే బాలయ్య క్యారెక్టర్‌కు "టపోరి" అనే టైటిల్ సరిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



