ఏముందయ్యా బాహుబలిలో..?
on Mar 23, 2017

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచస్థాయిలో నిలబెట్టి..తెలుగువారికి గర్వకారణంగా నిలిచిన బాహుబలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. త్వరలో రానున్న బాహుబలి ది కన్‌క్లూజన్ కోసం అంతే ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ప్రపంచం..అలాంటి సినిమాను తేలిగ్గా తీసిపడేశారు సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ..అసలు బాహుబలి సినిమాలో ఏముంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్బంగా బాహుబలి గురించి ఆయన్ను అడగ్గా..అందుకు స్పందించిన కైకాల ఆ సినిమా గురించి మూడే మూడు ముక్కల్లో తేల్చేశారు..ఇందులో భారీ సెట్లు, గ్రాఫిక్స్ మాత్రం ఉన్నాయి.. మా రోజుల్లో వాటిని "ట్రిక్స్" అనే వాళ్లం..ఇప్పుడు పేరు మార్చి గ్రాఫిక్స్ అంటున్నారు. అంతకు మించి కథగా చెప్పుకోవడానికి బాహుబలిలో ఏముంది అన్నారు. కోట్లు ఖర్చు పెట్టి సెట్‌లు వేసి సినిమా తీసేస్తే మన తెలుగు సినిమా స్థాయి పెరిగినట్లేనా..? అంటూ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



