క్రేజీ కాంబో సెట్ చేసిన మైత్రి.. డైరెక్టర్ చెప్పిన స్టోరీకి హీరో ఫిదా..!
on Jun 5, 2025
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం పి. మహేష్ బాబు దర్శకత్వంలో 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ నెక్స్ట్ మూవీ సైతం మైత్రి బ్యానర్ లోనే రూపొందనుందని తెలుస్తోంది. ఈ మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేసే అవకాశముందని సమాచారం.
'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. మూడో చిత్రం 'టక్ జగదీష్' నేరుగా ఓటీటీలో విడుదలైంది. గత చిత్రం 'ఖుషి' భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టి, ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మించడం విశేషం. అయితే 'ఖుషి' ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ.. శివ నిర్వాణ ప్రతిభ మీద నమ్మకంతో.. మైత్రి మరో సినిమా నిర్మించడానికి సిద్ధమైనట్లు వినికిడి.
శివ నిర్వాణ ఓ మంచి కథని సిద్ధం చేశాడని, అది రామ్ కి సరిగ్గా సరిపోయేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే మైత్రి వీరిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చేసిందని, శివ చెప్పిన స్టోరీ లైన్ కి రామ్ ఇంప్రెస్ అయ్యాడని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
