శ్రీను దరిద్రాన్ని వదిలించగల ఆ ఒకేఒక్కడు ఎవరు..?
on Jun 26, 2017
కామెడిని మెయిన్ ఎలిమెంట్‌గా సినిమాలు తీస్తూ..ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే ఈతరం దర్శకుల్లో శ్రీనువైట్ల ముందుంటారు. ఎంతపెద్ద స్టార్ హీరోలున్నా..ఈయన సినిమాల్లో కామెడీనే అసలు హీరో. ఒకనొక టైంలో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ ఒక వెలుగు వెలిగాడు శ్రీను. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..ఆగడు నుంచి నిన్న మొన్నటి మిస్టర్ వరకు తీసిన ప్రతి సినిమా బోల్తా కొట్టడంతో శ్రీను పరిస్థితి దారుణంగా తయారైంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేశాయి. ఆఖరికి చాలా మంది శ్రీనువైట్ల వైపు వెళ్లడానికి కూడా ముఖం చాటేస్తున్నారట..ఎక్కడ ఛాన్స్ అడుగుతాడేమోనని..అయితే ఒక హీరో మాత్రం పెద్ద మనసుతో శ్రీనువైట్లకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడట. అతను ఎవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. ఈమేరకు రవితేజతో శ్రీను కథా చర్చలు జరిపినట్లు ఫిలింనగర్ టాక్. ఇప్పుడు ఇదే గనుక నిజమైతే శ్రీనువైట్ల ఫేట్ మారినట్లే. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.
Also Read